Advertisement

పండుగ సీజన్లలో ఫేస్‌ మాస్క్‌లు

By: chandrasekar Wed, 30 Sept 2020 3:10 PM

పండుగ సీజన్లలో ఫేస్‌ మాస్క్‌లు


కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా ఉండేందుకు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సలహా ఇచ్చింది. రాబోయే పండుగ సీజన్లలో ఫేస్‌ మాస్క్‌లు పెట్టుకొని జరుపుకోవాలని, అన్ని కరోనా‌ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మాట్లాడుతూ ‘రాబోయే రోజుల్లో మాస్క్‌ వాలీ ఛఠ్‌, దసరా, దీపావళి, ఈద్‌ పండుగలను జరుపుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా.. రానున్న ఉత్సవాలు, శీతాకాలం నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా వినూత్నమైన కంట్రిమెంట్‌ వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డీజీ బలరామ్‌ భార్గవ స్పష్టం చేశారు.

దేశంలో కరోనా లాక్‌డౌన్‌ మార్చి 24న విధించగా మొదటిసారిగా పండుగలన్నీ ఆంక్షల మధ్య ప్రజలు జరుపుకున్నారు. రాబోయే నెలల్లో ఛఠ్‌, దసరా, దీపావళి, క్రిస్మస్‌, ఈద్‌ పండుగలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది.

Tags :
|
|
|

Advertisement