Advertisement

ఎఫ్ 3 సినిమా లో వెంకటేష్ కోసం ప్రత్యేక సెట్

By: Sankar Tue, 22 Dec 2020 9:37 PM

ఎఫ్ 3 సినిమా లో వెంకటేష్ కోసం ప్రత్యేక సెట్


వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత సంక్రాంతికి వచ్చి బంపర్ హిట్ అయిన చిత్రం ఎఫ్ 2...దీనితో దీనికి కొనసాగింపుగా ఎఫ్ త్రీ సినిమాను ప్రారంభించారు దర్శకుడు అనిల్ రావిపూడి..ఇందులోకూడా హీరోలుగా వరుణ్ తేజ్ , వెంకటేష్ నటిస్తున్నారు..ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి...

ఈ సినిమాను కూడా ఎఫ్2కు నిర్మాతగా వ్యవహరించిన దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ ఎఫ్3 సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. దీని కోసం హైదరాబాద్ కొండాపూర్లో ప్రత్యేకమైన సెట్ వేశారు. అందులో వెంకటేష్ కు సంబంధించన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

దీని తరువాత షిడ్యూల్‌లో మిగితా పాత్రధారులు వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కూడా పాల్గోననున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలను పెంచుకున్నారు. మరి వారి అంచనాలను ఎంతవరకూ ఈ సినిమా అందుకుంటుందో వేచి చూడాలి.

Tags :
|
|

Advertisement