Advertisement

  • అమెరికా లో జాత్యహంకార దాడులపై గళం విప్పిన క్రీడాలోకం

అమెరికా లో జాత్యహంకార దాడులపై గళం విప్పిన క్రీడాలోకం

By: Sankar Tue, 02 June 2020 11:36 AM

అమెరికా లో జాత్యహంకార దాడులపై గళం విప్పిన క్రీడాలోకం

అమెరికా లో జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఇప్పట్లో ఆగేలా లేవు ..తాజాగా ఆ నిరసనలకు క్రీడాలోకం కూడా మద్దతు తెలిపింది.. తాజాగా ఈ ఘటనపై ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ గళం విప్పాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ నల్లజాతి రేసర్‌ అయిన హామిల్టన్‌ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

lewis hamilton,michel jordan,formula one,basket ball, , లూయిస్‌ హామిల్టన్‌,  జార్జ్‌ ఫ్లాయిడ్‌,నిరసనలు , జాతి వివక్షపై, క్రీడాలోకం

ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్‌ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్‌ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్‌ మీడియా వేదికపై నినదించారు.

ఆఫ్రికన్‌–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్‌బీఏ సూపర్‌స్టార్‌ జోర్డాన్‌ అన్నాడు.

Tags :

Advertisement