Advertisement

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు

By: chandrasekar Wed, 05 Aug 2020 9:02 PM

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు


హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరించారు. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు చెప్పారు. దక్షిణ గుజరాత్ నుంచి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్తో పాటు ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు.

బుధవారం రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక గురు, శుక్రవారాల్లో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా చెప్పారు. గురువారం ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Tags :

Advertisement