Advertisement

  • దేశంలో వాహన పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగింపు

దేశంలో వాహన పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగింపు

By: chandrasekar Tue, 25 Aug 2020 09:14 AM

దేశంలో వాహన పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగింపు


దేశంలో వాహన పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగింపు చేసింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గడువు ముగిసిన వాహన డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర మోటారు వాహనాల పత్రాల చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు ఉంది. ఇప్పటివరకు మార్చి 30, జూన్ 9 న పొడిగింపు ఇవగా ఇది మూడవ సారిగా పొడిగింపు చేయబడింది. మోటారు వాహనాల చట్టం, 1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు, 1989 ప్రకారం ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మోటారు వాహనాల చట్టం, 1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు, 1989 కు సంబంధించిన పత్రాల చెల్లుబాటు విస్తరణకు సంబంధించి ఈ సంవత్సరం మార్చి 30, జూన్ 9 న ఫిట్‌నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా అన్నిరకాల పత్రాలు చెల్లుబాటు కావాలని సలహా ఇచ్చారు. ఇతర సంబంధిత పత్రం 2020 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయి అని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ తెలిపింది. డిసెంబర్ 31, 2020 వరకు అన్నిరకాల వాహన పత్రాలు చెల్లుబాటు అయ్యేలా వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సూచించాం అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఎవరైతే ఫిట్‌నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా అన్నిరకాల పత్రాలు చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు నవీకరించవచ్చు. ప్రభుత్వం తీసికున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా వెసులు బాటు అందినట్లైనది.

Tags :

Advertisement