Advertisement

  • రైలు సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వ తేదీ వరకు పొడగింపు... రైల్వేశాఖ కీలక నిర్ణయం

రైలు సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వ తేదీ వరకు పొడగింపు... రైల్వేశాఖ కీలక నిర్ణయం

By: chandrasekar Tue, 11 Aug 2020 10:19 AM

రైలు సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వ తేదీ వరకు పొడగింపు... రైల్వేశాఖ కీలక నిర్ణయం


భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజూ 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును సెప్టెంబరు ౩౦వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 కరోనా స్పెషల్ రైళ్లు (కోవిద్ -19 ట్రైన్స్ ) మాత్రమే నడుస్తాయని ఈ సందర్భంగా రైల్వేశాఖ తెలిపింది.

నిత్యం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ ప్రజలకు సూచించింది. ఇంతకు ముందు రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు రైళ్ల రద్దును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 22లక్షలు మించి పోయాయి. ప్రస్తుతం దేశంలో 6లక్షల 34వేలకు పైగా కరోనా యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకు 15లక్షల 34వేల మందికి పైగా బాధితులు ఈ మహమ్మారి నుంచి బయట పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల దాదాపు 44వేలకు పైగా బాధితులు మృతి చెందారు.

Tags :

Advertisement