Advertisement

అంత‌‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

By: chandrasekar Sat, 01 Aug 2020 5:59 PM

అంత‌‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు


కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని మ‌రోసారి పొడిగించింది. క‌రోనా ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి భార‌త పౌర‌విమాన‌యాన శాఖ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని విడ‌త‌ల వారీగా పొడిగిస్తున్న‌ది.

చివ‌రిసారిగా జూలై 15 నుంచి 31 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. శుక్ర‌వారం నాటికి ఆ గడువు కూడా ముగియ‌డంతో ఏకంగా మ‌రో నెల రోజుల‌పాటు నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. అంటే ఆగ‌స్టు 31 వ‌ర‌కు నిషేధం కొన‌సాగుతుంది.

ఈ మేర‌కు పౌర‌విమానయాన శాఖ ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. అయితే, అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని భార‌త పౌర‌విమాన‌యాన శాఖ తెలిపింది. అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌కు, డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టంచేసింది.

'అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల రాక‌పోక‌ల‌పై ఆగ‌స్టు 31 అర్ధ‌రాత్రి 11:59 వ‌ర‌కు నిషేధం పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది' అని సివిల్ ఏవియేష‌న్ మినిస్ట్రీ ఒక‌‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Tags :
|

Advertisement