Advertisement

  • జులై వరకూ కరోనా కేసులు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయని నిపుణులు అంచనా

జులై వరకూ కరోనా కేసులు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయని నిపుణులు అంచనా

By: chandrasekar Thu, 28 May 2020 3:07 PM

జులై వరకూ కరోనా కేసులు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయని నిపుణులు అంచనా


కోవిడ్-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ పదో స్థానంలో ఉంది.జులై వరకూ భారత్‌లో కోవిడ్-19 కేసులు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ 1.38 లక్షలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ ఉన్నాయి.ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ కరోనావైరస్ కారణంగా 4,024 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి 13 రోజులకూ కేసులు రెట్టింపవుతున్నాయి.

experts,estimate,july,few million,coronary cases ,జులై, వరకూ, కరోనా, కేసులు, కొన్ని లక్షల


లాక్‌డౌన్ ఆంక్షలను కూడా ప్రభుత్వం ఇప్పుడు సడలించడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడైతే కేసులు పెరుగుతున్నాయి. పీక్ వస్తుంది. కానీ, అది ఎప్పుడు వస్తుందనేది మెడికల్ డేటాపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది నిపుణులు దీనిపై డేటా మోడలింగ్ చేశారు. వారిలో భారత నిపుణులు ఉన్నారు. విదేశీ నిపుణులు ఉన్నారు. ఎక్కువ మంది జూన్-జులైలో పీక్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టులోనూ వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు లెక్కగట్టారు’’ అని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులెరియా చెప్పారు.

Tags :
|

Advertisement