Advertisement

  • ఏపీలో ఖరీదైన వైద్యసేవలు కూడా ఆరోగ్య శ్రీ పథకంలోకి

ఏపీలో ఖరీదైన వైద్యసేవలు కూడా ఆరోగ్య శ్రీ పథకంలోకి

By: chandrasekar Wed, 11 Nov 2020 09:30 AM

ఏపీలో ఖరీదైన వైద్యసేవలు కూడా ఆరోగ్య శ్రీ పథకంలోకి


ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య అవసరాల కోసం మరిన్ని వైద్య సదుపాయాలు ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చారు. ప్రస్తుతం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని సంపూర్ణంగా పూర్తిగా అమలు చేయనున్నట్టు జగన్ చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకంపై సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లివర్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక ఖరీదైన వైద్యం కూాడా ఇకపై ఆరోగ్య శ్రీ పథకంలో రానుంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల అవసరాలకు తగ్గట్టు రాష్ట్రంలో వీటికోసం తగిన ఆసుపత్రుల్ని గుర్తించి సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికార్లను ఆదేశించారు. ఆరోగ్య శ్రీపై జగన్ నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు మరిన్ని వైద్య సేవలు పొందనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్‌ హెల్త్‌‌కార్డులు జారీ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని గుర్తించామని చెప్పారు.

వైద్య సేవలో వేయి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి వైద్యం ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాల్సిందేనని వైఎస్ జగన్ తెలిపారు. ఆరోగ్య శ్రీ ప్యానెల్‌ లో ఉన్న ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా ప్రమాణాల్ని పాటించాలని జగన్ సూచించారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపు విధిగా పొందాలన్నారు. రాష్ట్రంలో టెలి మెడిసిన్ కాల్‌సెంటర్‌ను మరింతగా బలోపేతం చేయాలన్నారు. ఈ సెంటర్‌లో ప్రతి రోజూ వైద్య నిపుణుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్య శ్రీ ప్యానెల్ ఆసుపత్రుల్లో మంచి ఆహారం, డిశ్చార్జ్ అయిన తరువాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా పథకం వర్తింపచేయటం చేయాలన్నారు. దీనివల్ల ప్రజలకు ఖరీదైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.

Tags :

Advertisement