Advertisement

  • హైదరాబాద్‌లో డాటా సెంటర్లకు అనూహ్యంగా డిమాండ్

హైదరాబాద్‌లో డాటా సెంటర్లకు అనూహ్యంగా డిమాండ్

By: chandrasekar Fri, 02 Oct 2020 3:55 PM

హైదరాబాద్‌లో డాటా సెంటర్లకు అనూహ్యంగా డిమాండ్


డాటా సెంటర్లకు హైదరాబాద్‌లో అనూహ్యంగా డిమాండ్‌ పెరుగుతున్నది. వచ్చే ఐదున్నరేండ్లలో డాటా సెంటర్ల సామర్థ్యం మూడింతలు కావచ్చని తాజా సర్వేలో వెలువడింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మెయింటెనెన్స్‌ విండో సామర్థ్యం 32గా ఉండగా 2025 చివరి నాటికి ఇది 130 ఎండబ్ల్యూకి చేరుకోనున్నదని ‘డాటా సెంటర్స్ భారత్‌లో డిజిటల్‌ ఎకానమి’ పేరుతో విడుదల చేసిన నివేదికలో జేఎల్‌ఎల్‌ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో 57 ఎండబ్ల్యూ కెపాసిటీ ఏర్పాటుకానుండగా, ఇదే సమయంలో 27 ఎండబ్ల్యూ సరఫరా కానున్నదని జేఎల్‌ఎల్‌ పేర్కొంది.

టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేసీఆర్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు ఇందుకు అద్దం పడుతున్నాయని జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ముఖ్యంగా డాటా సెంటర్లను ఏర్పాటు చేసేవారికి పలు రాయితీలు ఇవ్వడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని పేర్కొన్నది. భారత్‌లో 375 ఎండబ్ల్యూగా ఉన్న డాటా సెంటర్ల సామర్థ్యం 2025 నాటికి 1,078 ఎండబ్ల్యూకి చేరుకోనున్నది. ఈ రంగంలోకి 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది. నూతన టెక్నాలజీకి డిమాండ్‌ నెలకొనడం, ముఖ్యంగా 5జీ, కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లు ఇందుకు ప్రధాన కారణం. ఐటీ/ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఈ-కామర్స్‌, క్యాపిటల్‌ మార్కెట్లు, సోషల్‌ మీడియాలు డిజిటల్‌ బాట పట్టడం కూడా పరోక్షంగా డాటా సెంటర్లకు డిమాండ్‌ నెలకొన్నది.

Tags :
|

Advertisement