Advertisement

హోమ్ క్వారంటైన్ లో మాజీ ఎంపీ కవిత

By: Sankar Fri, 24 July 2020 08:48 AM

హోమ్ క్వారంటైన్ లో మాజీ ఎంపీ కవిత



తెలంగాణాలో రాజకీయ నాయకులను కరోనా వదలడం లేదు..ఇప్పటికే అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులూ కరోనా బారిన పడగా తాజాగా తెరాస మాజీ ఎంపీ కవిత కూడా కరోనా వలన హోమ్ క్వారంటైన్ అయ్యారు ..అయితే కరోనా ఆమెకి రాకపోయినప్పటికీ ఆమె డ్రైవర్ కి రావడం వలన ముందు జాగ్రత్తగా హైద్రాబాద్లోని తన నివాసానికి పరిమితం అయ్యారు ...కార్ డ్రైవర్ కు గురువారం రోజు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు ..

కాగా కవిత సోదరుడు తెరాస కీలక నాయకుడు మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కవిత గురువారం ఓ పాటను విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్‌ రచించిన గీతాన్ని యాజీన్‌ నిజార్‌ ఆలపించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు.

సంగీతం భరత్ అడోనిస్, కొరియో గ్రాఫర్ శేఖర్ తదితరులు ఈ పాటను రూపొందించారు. ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాట విడుదలైంది. కేటీఆర్‌ శుక్రవారం తన 45వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోనున్నారు..

Tags :
|
|
|

Advertisement