Advertisement

వైకుంఠ దర్శనానికి రోజు 30వేలమందికి అనుమతి

By: Sankar Thu, 24 Dec 2020 9:53 PM

వైకుంఠ దర్శనానికి రోజు 30వేలమందికి అనుమతి

వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని, రోజుకు 30 వేల మందికి దర్శనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. ముందుగా వీఐపీ ప్రొటోకాల్‌, శ్రీవారి ట్రస్ట్‌ భక్తులకు అనుమతి ఉంటుందని, ఉదయం 7:30 నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులంతా కోవిడ్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరారు..

ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారా దర్శనాన్ని ఈ ఏట నుంచి టీటీడీ 10 రోజుల పాటు తెరవనున్నది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం సామాన్యులే కాక ఇటు విఐపిలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో టీటీడీ భక్తులకు ముందుగానే దర్శన టోకెన్లను జారీ చేసి టిక్కెట్టు వున్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తోంది.

Tags :
|

Advertisement