Advertisement

  • ఆర్టీసీ బస్సుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ..మంత్రి పువ్వాడ అజయ్

ఆర్టీసీ బస్సుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ..మంత్రి పువ్వాడ అజయ్

By: Sankar Mon, 08 June 2020 11:26 AM

ఆర్టీసీ బస్సుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ..మంత్రి పువ్వాడ అజయ్


రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో సిబ్బందికి వేతనాలు, ప్రజా రవాణా సంస్థకు మళ్లీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మరో రెండు నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుందని ఆశిస్తున్నాం..’అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అన్న నినాదం ఆది నుంచి ఉన్నట్టుగానే, కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా బస్సు ప్రయాణం భద్రంగా ఉండేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ప్రతి బస్సును శానిటైజ్‌ చేసిన తర్వాతనే బయటకు తీస్తున్నారు. అందులో ప్రయాణికులకు శానిటైజర్లు సిద్ధంగా ఉంచుతున్నారు. బస్సులో ప్రయాణం అంటే ప్రజలు భయపడాల్సిన పనిలేదు. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దాన్ని ప్రజలు కూడా గుర్తించాలి..’అని కోరారు

rtc,bus,sanitize,puvvada ajay,minister ,ఆర్టీసీ,  ప్రజా రవాణా, బస్సు, శానిటైజర్లు , పువ్వాడ అజయ్

ప్రస్తుతం కరోనాతో ఆర్టీసీ కూడా కుదేలైంది. లాక్‌డౌన్‌కు పూర్వం ఆర్టీసీకి నిత్యం సగటున రూ.12 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అంతర్‌రాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులు తిప్పకుండా కేవలం జిల్లా సర్వీసులు మాత్రమే నడుపుతున్నాం. బస్సు కంటే సొంత వాహనంలో ప్రయాణానికే జనం ఎక్కువగా మొగ్గుచూపుతున్నందున ప్రస్తుతం రోజువారీ ఆదాయం రూ.3.5 కోట్లు మాత్రమే సగటున ఉంటోంది. కిలోమీటరుకు వచ్చే ఆదాయం కూడా గతంలో సగటున రూ.43 ఉంటే ప్రస్తుతం అది రూ.20 గానే ఉంటోంది. బస్సులు తిరిగి ప్రారంభమైన కొత్తలో ఇది మరీ తక్కువగా ఉండేది. ఇప్పుడు రాత్రి సర్వీసులు, ఇమ్లీబన్‌ స్టేషన్‌లోకి బస్సులను అనుమతించటం ప్రారంభించాక పెరిగింది. మరో 2 నెలల్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక్కసారి శుభకార్యాలు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర కార్యకలాపాలు పుంజుకుంటే ఆర్టీసీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా నిత్యం దాదాపు 5 వేల బస్సులను తిప్పుతున్నాం. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 45 శాతానికి చేరింది. ఇది కొంత శుభసూచకం. బస్సులను సురక్షితంగా ఉండేలా తీసుకుంటున్న చర్యలను ప్రయాణికులు కూడా క్రమంగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా.. ఎక్కడా బస్సుల వల్ల కొత్తగా కేసులు పెరిగినట్టు ఆధారాలు లేవు. ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బస్సుల్లో ప్రయాణానికి ముందుకు రావాలి. అని మంత్రి అన్నారు

Tags :
|
|

Advertisement