Advertisement

  • సఖరోవ్ బహుమతి సంఘం నుంచి మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని సస్పెండ్ చేసిన యురోపియన్ యూనియన్

సఖరోవ్ బహుమతి సంఘం నుంచి మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని సస్పెండ్ చేసిన యురోపియన్ యూనియన్

By: chandrasekar Fri, 11 Sept 2020 5:46 PM

సఖరోవ్ బహుమతి సంఘం నుంచి మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని సస్పెండ్ చేసిన యురోపియన్ యూనియన్


సఖరోవ్ బహుమతి సంఘం నుంచి మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని యురోపియన్ యూనియన్ సస్పెండ్ చేసింది. మయన్మార్ లో రోహింగ్యాల అణచివేతపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీపై యురోపియన్ యూనియన్ చర్యలకు ఉపక్రమించింది. సఖరోవ్ బహుమతి సంఘం నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయిం తీసుకున్నది. సఖరోవ్ బహుమతి సంఘం అంటే మాజీ మానవ హక్కుల బహుమతి పొందిన వారి బృందం. ఆంగ్ సాంగ్ సూకీ మయన్మార్ లో అధికారంలోకి రాకముందే సుదీర్ఘకాలం రాజకీయ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటం జరిపి ప్రశంసలు అందుకున్నారు.

అహింసాయుత పోరాటం జరిపినందుకుగాను ఆమె 1991లో నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నారు. అంతకుముందు 1990 లో ఆమె సఖరోవ్ బహుమతిని గెల్చుకున్నారు. 2017 లో సైన్యం నుంచి తప్పించుకోవడానికి 7,00,000 మందికిపైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దేశానికి పారిపోయారు. అక్కడి నుంచి పలువురు రోహింగ్యాలు పొరుగునే ఉన్న మయన్మార్ కు శరణార్ధులుగా వెళ్లారు. అయితే అక్కడి సైన్యం వారిపై అరాచకాలు కొనసాగిస్తుండటం, వారికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలపై పెదవి విప్పకపోవడంపై యురోపియన్ యూనియన్ ఆంగ్ సాంగ్ సూకీపై ఆగ్రహంతో ఉన్నది. మయన్మార్ ప్రభుత్వ సలహాదారుగా ఉండి కూడా ఈ దారుణాలను వ్యతిరేకించకపోవడం విచారకరమని ఈయూ పేర్కొన్నది. దాంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించి సఖరోవ్ బహుమతి గ్రహీతల సమాజం నుంచి సస్పెండ్ చేశారు. రోహింగ్యాల పై సైన్యం చాలా అరాచకాలకు దిగింది. వీటిని చూసికూడ స్పందించని ఆమెపై చర్య తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

Advertisement