Advertisement

  • రేపటి నుంచి పెద్ద మొత్తంలో పరీక్షలు చేస్తాం ..ఈటెల రాజేందర్

రేపటి నుంచి పెద్ద మొత్తంలో పరీక్షలు చేస్తాం ..ఈటెల రాజేందర్

By: Sankar Mon, 29 June 2020 4:17 PM

రేపటి నుంచి పెద్ద మొత్తంలో పరీక్షలు చేస్తాం ..ఈటెల రాజేందర్



హైదరాబాద్‌ నగర ప్రజలు కరోనా వైరస్‌కు భయపడుతున్నారని, హైదరాబాద్‌లో అవసరమైతే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని వేల మందికి చికిత్స అందిస్తుంటే.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర్ధరాత్రులు వచ్చిన వారికి కూడా చికిత్స అందిస్తున్నాం. వైద్య శాఖలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. హెడ్ నర్సు ఒకరు చనిపోయారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందిలో 36 మందికి కరోనా వచ్చింది. వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దు.

మన దేశంలో మరణాలు ఎక్కువగా లేవు. దేశంలో మరణాలు 3 శాతమే. మన రాష్ట్రంలో డెత్ రేట్ 1.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు చేసుకున్నాం. కరోనా విషయంలో పల్లెల్లో భయం లేదు. హైదరాబాద్ విషయంలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. నగరంలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాం. ఐసీఎమ్‌ఆర్‌ గైడ్ లైన్స్ ప్రకారం చికిత్స చేస్తున్నాం. రేపటి నుంచి పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు చేస్తాం అని అన్నారు.

కాగా, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది.




Tags :
|
|

Advertisement