Advertisement

  • మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు

మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు

By: chandrasekar Wed, 23 Sept 2020 1:31 PM

మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు


మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు చేయనున్నారు. హై రిస్క్ మెడికల్ పరికరాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ, ఆ రంగంలో పూర్తి స్థాయి సేవలందించే బయో మెడికల్ పార్క్ గా తాయారు కాబోతుంది. వైద్య పరికరాల తయారీ రంగంలో పరీక్ష విధానం, పరిశోధన - రూపకల్పన, వైద్య పరికరాల పనితీరుపై అంచనా వంటి అంశాల్లో పూర్తి స్థాయి సేవలను ఈ మెడికల్ పార్క్ అందిస్తుంది. మెడ్.స్పార్క్ పేరిట ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే చిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ , కేరళ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఉమ్మడి చొరవతో ఈ బయోమెడికల్ పార్క్ ఏర్పాటు కానున్నది.

తిరువనంతపురం, తొణ్ణక్కల్ ప్రాంతంలో ఉన్న జీవ శాస్త్రాల పార్క్ లో ఈ పార్క్ ను నిర్మించనున్నారు. కీలకమైన శస్త్ర చికిత్సలో వినియోగించే ముఖ్యమైన వైద్య పరికరాల తయారీపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టనుంది . శరీరం అంతర్భాగంగా అమర్చే హై రిస్క్ యాంత్రిక ఇంప్లాంట్ల తయారీకి ఈ సంస్థ ప్రాధాన్యం ఇస్తుంది. పార్క్ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. సంస్థకు హైరిస్క్ ఇంప్లాంట్ల తయారీ రంగంలో మంచి పరిజ్ఞానం ఉన్నది. కీలకమైన వైద్య పరికరాలకు సంబంధించి వాటి పనితీరుపై పూర్తి స్థాయి సేవలందించే వ్యవస్థను ఈ సంస్థ కల్పిస్తుంది. తయారీ మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మకత, పరిజ్ఞాన వ్యాప్తి తదితర అంశాలకు సంబంధించి వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన సేవలన్నింటినీ ఈ సంస్థ అందిస్తుంది. మెడ్.స్పార్క్ పరిధిలోని వైద్య పరికరాల పరిశ్రమలతో పాటుగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఈ తరహా పరిశ్రమలు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీనితో వైద్య పరికరాల తయారీ రంగంలో ఉన్న చిన్న, మధ్యతరహా మెడికల్ డివైజెస్ తయారీ పరిశ్రమలకు ఈ పార్క్ ప్రయోజనకరంగా ఉండబోతుంది.

Tags :

Advertisement