Advertisement

  • బీహార్‌కు చెందిన వలస కార్మికల కోసం 1300 శ్రామిక్‌ రైళ్ల ఏర్పాటు

బీహార్‌కు చెందిన వలస కార్మికల కోసం 1300 శ్రామిక్‌ రైళ్ల ఏర్పాటు

By: chandrasekar Mon, 29 June 2020 2:44 PM

బీహార్‌కు చెందిన వలస కార్మికల కోసం 1300 శ్రామిక్‌ రైళ్ల ఏర్పాటు


కశ్మీర్‌, ట్రాల్‌ ప్రాంతంలో ఈ ఏడాది 100మందికిపైగా ఉగ్రవాదులను ఏరిపారేసి వాటిని మిలటరీ ఫ్రీ జోన్లుగా మార్చామని కేంద్ర హోంవ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.

బీహార్‌ రాష్ట్రంలోని మధుబన్‌ జిల్లాలో ఆదివారం నిర్వహించిన వర్చువల్‌ ర్యాలీలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇది రక్షణదళాలు సాధించిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.

బీహార్‌లో వరద కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రహోంశాఖ మంత్రి పరిశీలిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో సాయం అందించే అవకాశాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలోని పలు ప్రాంతాల్లోని బీహార్‌కు చెందిన వలస కార్మికలను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు 1300 శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌ సారథ్యంలో రాష్ట్రంలోని 243 శాసనసభ స్థానాలకు 220 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement