Advertisement

  • హరితహారమును విజయవంతం చేయాలి ..పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హరితహారమును విజయవంతం చేయాలి ..పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

By: Sankar Wed, 24 June 2020 6:40 PM

హరితహారమును విజయవంతం చేయాలి ..పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు



తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ఆరవ విడత హరితహారం సందర్భంగా బుధవారం ప్రజా ప్రతినిధులు, అధికారుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హరింతహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. నూటికి నూరు శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఉపాధి హామీ పథకాన్నిసద్వినియోగం చేస్తూ అన్నిపనులు జరిగేలా చూడాలన్నారు. అలాగే హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు అనుసంధానం చేసిన ఉపాధి హామీపథకం బాగా జరిగేలా చూడాలన్నారు. కల్లాల నిర్మాణం వంటి అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, వరంగల్‌అర్బన్‌, రూరల్‌కలెక్టర్లు,ఆయాశాఖల అధికారులతో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా పాల్గొన్నారు.




Tags :
|
|

Advertisement