Advertisement

అతి చిన్న వయస్సులో గిన్నిస్ రికార్డులోకి ...

By: chandrasekar Tue, 10 Nov 2020 8:43 PM

అతి చిన్న వయస్సులో గిన్నిస్ రికార్డులోకి ...


అహ్మదాబాద్ కు చెందిన ఓం తల్సానియా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు అర్హం ఓం తల్సానియా కోడింగ్ పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో అతనికి బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ను నేర్పించాడు. తండ్రి ప్రోత్సాహంతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించాడు ఆ బాలుడు. కాగా, ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న అర్హం ఓం తల్సానియా ఇటీవలే పియర్సన్ వియు పరీక్షా కేంద్రంలో జరిగిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ భాషను క్లియర్ చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నిలిచాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కడంపై బాలుడు మాట్లాడుతూ.. “సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న మా నాన్న నాకు కోడింగ్ నేర్పించారు. నేను 2 సంవత్సరాల వయస్సులోనే టాబ్లెట్లను వాడటం, 3 సంవత్సరాల వయస్సులోనే iOS, Windows గాడ్జెట్లను ఉపయోగించడాన్ని ప్రారంభించాను. మా నాన్న ఫైథాన్ ప్రోగ్రామింగ్ పై పనిచేస్తుండటంతో నాకు బేసిక్స్ నేర్పించారు. ఇది నాకు బాగా ఉపయోగపడింది.” అని తల్సానియా చెప్పాడు. అంతేకాక, “పైథాన్ బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని, నేనే స్వయంగా చిన్న ఆన్లైన్ గేమ్ ను సృష్టించాను. వీటిని గిన్నిస్ బుక్ కమిటీకి పంపగా వారు నేను చేసిన ప్రోగ్రామింగ్ వర్క్ కు సంబంధించిన రుజువును పంపమని అడిగారు. కొన్ని రోజుల తర్వాత, ఆ గేమ్ ను నేనే డిజైన్ చేశానని నిర్థారించుకున్న తర్వాత నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ను అందించారు.” అని అర్హం ఓం తల్సానియా చెప్పాడు.

భవిష్యత్ లక్ష్యాల గురించి మీడియా అర్హం ఓం తల్సానియాను అడగగా.. తనకు వ్యాపార బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఉందని అన్నాడు. అంతేకాక, భవిష్యత్ లో మరిన్ని యాప్స్, గేమ్స్ రూపొందించి ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. కాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అర్హం తల్సానియా తండ్రి ఓం తల్సానియా మాట్లాడుతూ..“నా కుమారుడు చిన్నతనంలోనే కోడింగ్ పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక అంశాలను అతనికి నేర్పించాను. తద్వారా తానే స్వయంగా చిన్న చిన్న గేమ్ ను రూపొందించాడు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ పరీక్షను క్లియర్ చేయడంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ను సాధించాడు. తద్వారా ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్ గా నిలిచాడు. ఇంత చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాధించడం చాలా సంతోషంగా ఉంది.’’ అని అన్నాడు.

Tags :

Advertisement