Advertisement

  • కరోనా హోమ్ ఐసోలేషన్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి ..ఈటెల రాజేందర్

కరోనా హోమ్ ఐసోలేషన్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి ..ఈటెల రాజేందర్

By: Sankar Thu, 06 Aug 2020 7:48 PM

కరోనా హోమ్ ఐసోలేషన్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి ..ఈటెల రాజేందర్



కరోనా రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లు మంత్రుల సూచనలు తీసుకోవాలన్నారు. హోం ఐసోలేషన్‌లో రోగులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. వైద్యుల నుంచి సరైన కౌన్సిలింగ్‌ అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... కొవిడ్‌ పరీక్షలకు వచ్చే వారి వివరాలు యాప్‌లో నమోదు చేయాలన్నారు. పాజిటివ్‌ వస్తే పరీక్షా కేంద్రం వద్దే కిట్‌ ఇచ్చి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని చెప్పారు. కొవిడ్‌కు సంబంధించి పెండింగ్‌ బిల్లుల వివరాలు ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. కొవిడ్‌ చికిత్సకు ప్రోటోకాల్‌ మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని ఔషదాల వివరాలతో సర్క్యూలర్‌ రూపొందించాలని పేర్కొన్నారు.

Tags :
|
|
|
|

Advertisement