Advertisement

  • విజయమే లక్ష్యంగా రెండో టెస్టులో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్..

విజయమే లక్ష్యంగా రెండో టెస్టులో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్..

By: Sankar Thu, 16 July 2020 1:57 PM

విజయమే లక్ష్యంగా రెండో టెస్టులో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్..



దాదాపు నాలుగు నెలల తర్వాత క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అంటే అందరి కళ్ళు ఆటగాళ్ల మీద కాకుండా మ్యాచ్ నిర్వహణ మీదనే ఉన్నాయి ..అసలే కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నదశలో అయిదు రోజుల పాటు టెస్ట్ సిరీస్ నిర్వహించడం సాధ్యం అయ్యే పనియేనా అని చాలా మంది భావించారు ..అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ప్రేక్షుకులు లేకపోయినప్పటికీ టెస్ట్ మ్యాచ్ ను అద్భుతంగా నిర్వహించి భవిష్యత్తులో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కొత్త ఊపిరి ఇచ్చింది ..అయితే మ్యాచ్ నిర్వహణ ఒక హైలైట్ అయితే అందులో పటిష్ట ఇంగ్లాండ్ జట్టు వాళ్ళ సొంత గడ్డమీద వాళ్ళకంటే బలహీనమైన వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోవడం ఇంకో హైలైట్ ..దీనితో ఈ రెండు జట్ల మధ్య జరిగే రెండో టెస్ట్ మీద అందరి కళ్ళు ఉన్నాయి ..

సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ తుది జట్టును మ్యాచ్‌ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ జో రూట్‌ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్‌ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్‌ వుడ్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

వారి స్థానాల్లో స్టువర్ట్‌ బ్రాడ్, ఒలీ రాబిన్సన్‌లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్‌ బ్రాడ్‌ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్‌ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్‌ రాకతో లైనప్‌ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్‌ బట్లర్‌ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్‌ మెరుగైన స్థితిలో నిలుస్తుంది.

ఇక తొలి టెస్టులో వెస్ట్ ఇండీస్ విజయంలో ఏ ఒక్క ఆటగాడో కాకుండా అందరు సమిష్టిగా రాణించారు దీనితో వెస్ట్ ఇండీస్ జట్టు మార్పులు ఏమి లేకుండానే తొలి టెస్టులో బరిలోకి దిగిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది .. జాసన్ హోల్డర్ జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందు ఉంది నడిపిస్తున్నాడు ..హోల్డర్ తో పాటు గాబ్రియల్ కూడా తొలి టెస్టులో అద్భుతంగా రాణించాడు ..అయితే వీరితో పాటు రోచ్ కూడా రాణిస్తే వెస్ట్ ఇండీస్ బౌలింగ్ కు తిరుగుండదు ..ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సలలో విపహలం అయినా స్టార్ట్ ఆటగాడు షై హోప్ మీద వెస్ట్ ఇండీస్ బారి శలే పెట్టుకుంది ..ఇక తొలి టెస్టులో రాణించిన బ్లాక్ వుడ్ , రోస్టన్ ఛేజ్ , రెండో టెస్టులో కూడా రాణించాలని విండీస్ జట్టు ఆశిస్తుంది ..వెస్ట్ ఇండీస్ జట్టులో విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్‌ కాకపోయినా జట్టుగా విండీస్‌ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు.


Tags :
|
|
|

Advertisement