Advertisement

  • బయో బబుల్ నిబంధనల నుంచి బయటకు వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు

బయో బబుల్ నిబంధనల నుంచి బయటకు వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు

By: Sankar Mon, 07 Sept 2020 6:51 PM

బయో బబుల్ నిబంధనల నుంచి బయటకు వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు


కరోనా కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అత్యంత కఠిన పరిస్థితుల్లో మ్యాచ్ లను ఆడుతుంది..బయో బబుల్ ఏర్పాటు చేసుకొని మ్యాచ్ లను నిర్వహిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే వెస్ట్ ఇండీస్ , ఐర్లాండ్ , పాకిస్తాన్ లతో సిరీస్ లని విజయవంతంగా నిర్వహించింది..ప్రస్తుతం ఆస్ట్రేలియా తో టి ట్వంటీ సిరీస్ లో తలపడుతుంది..ఇప్పటికే రెండు టి ట్వంటీ లు అయిపోయాయి.. రెండు మ్యాచ్ లలో గెలిచిన ఇంగ్లాడ్ సిరీస్ కూడా సొంతం చేసుకుంది.

ఆ రెండు మ్యాచ్ల విజయాలలో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ఇప్పుడు బయో బబుల్ నుండి బయటకు వచ్చేసాడు. బట్లర్ ఆ రెండు మ్యాచ్ లలో కలిపి మొత్తం 121 పరుగులు చేసాడు. కానీ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఉండటానికి సౌతాంప్టన్ లోని బయో బబుల్ ను విడిచిపెట్టాడు. అందువల్ల సెప్టెంబర్ 8న ఆస్ట్రేలియాతో జరగనున్న 3వ టీ 20 లో బట్లర్ పాల్గొనలేడు.

ఇందులో ఇప్పటికే సిరీస్ ఇంగ్లాండ్ తమ సొంతం చేసుకుంది. కానీ మళ్ళీ ఈ నెల 11 నుండి ప్రారంభం వన్డే సిరీస్ కు అతను అందుబాటులోకి వస్తాడా.. లేదా అనే విషయం తెలియదు.

Tags :
|
|
|

Advertisement