Advertisement

  • ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ తండ్రి కాన్సర్ తో మృతి

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ తండ్రి కాన్సర్ తో మృతి

By: Sankar Wed, 09 Dec 2020 11:49 AM

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ తండ్రి కాన్సర్ తో మృతి


ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. స్టోక్స్‌ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మరణ వార్తను క్లబ్ వర్కింగ్ టౌన్ ధృవీకరిచింది. న్యూజిలాండ్ దేశానికి చెందిన స్టోక్స్ ఇంగ్లాండ్ కు ఆడుతున్న విషయం తెలిసిందే...

కాగా మాజీ రగ్బీ ప్లేయర్‌ అయిన జేమ్స్‌ స్టోక్స్‌ వర్గింగ్‌ టౌన్‌ రగ్బీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్కింగ్‌ టౌన్‌ రగ్బీ క్లబ్‌ స్పందిస్తూ.. ' కోచ్ గెరార్డ్ స్టోక్స్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి 'అని ఓ ప్రకటనలో తెలిపింది..

అయితే తన తండ్రి ఆరోగ్యం బాగాలేని కారణంగానే స్టోక్స్ ఐపీయల్ 2020 లో కొన్ని మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే...ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న స్టోక్స్ న్యూజిలాండ్ బయలుదేరి వెళ్లనున్నాడు ....

Tags :
|
|

Advertisement