Advertisement

  • క్రికెట్ అభిమానులకు శుభవార్త ..త్వరలోనే క్రికెట్ మొదలుపెట్టేందుకు ఇంగ్లాండ్ సన్నాహాలు

క్రికెట్ అభిమానులకు శుభవార్త ..త్వరలోనే క్రికెట్ మొదలుపెట్టేందుకు ఇంగ్లాండ్ సన్నాహాలు

By: Sankar Sat, 30 May 2020 10:33 AM

క్రికెట్ అభిమానులకు శుభవార్త ..త్వరలోనే క్రికెట్ మొదలుపెట్టేందుకు ఇంగ్లాండ్ సన్నాహాలు

గత రెండు నెలలుగా ఎటువంటి క్రికెట్ మ్యాచ్లు లేక , క్రికెట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డులు శుభవార్త చెప్పాయి ..కరోనా కారణంగా వాయిదా పడ్డ క్రికెట్ టోర్నీ మళ్ళీ మొదలవుతున్నాయి..

క్రికెట్‌ పునరుద్దరణ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. జులైలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సిరీస్‌లో జూన్‌లోనే జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడటంతో క్రికెట్‌ పునరుద్దరణకు ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లకు పాకిస్తాన్‌ ఇప్పటికే ఆమోదముద్ర వేయగా తాజాగా వెస్టిండీస్‌ సైతం అంగీకారం తెలిపింది.

england,west indies,cricket,corona,icc ,ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ ,  క్రికెట్ బోర్డు,కరోనా ,పాకిస్తాన్‌


ఇంగ్లండ్‌ పర్యటనకు సంబంధించి వెస్టిండీస్‌ బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి ఆటగాళ్లను, సిబ్బందిని రప్పించడం, వారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక/ప్రయివేట్‌ విమానాలను ఏర్పాటు చేయడం వంటి తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఈసీబీ అనేక చర్యలు చేపడుతుందనే విశ్వాసాన్ని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వ్యక్తం చేసింది. ఇక వెస్టిండీస్‌తో మూడు టెస్టుల ముగిసిన వెంటనే పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ మరో సిరీస్‌ ఆడనుంది. దీంతో క్రికెట్‌ పునరుద్దరణకు మార్గం సుగమమైందని, ఈ సిరీస్‌లు విజవంతంగా జరిగితే మరికొన్ని దేశాలు ఆడేందుకు ముందుకు వస్తాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Tags :
|

Advertisement