Advertisement

  • మూడో టెస్టులో ఘన విజయంతో సిరీస్ ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్

మూడో టెస్టులో ఘన విజయంతో సిరీస్ ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్

By: Sankar Tue, 28 July 2020 9:10 PM

మూడో టెస్టులో ఘన విజయంతో సిరీస్ ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్



నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్‌లో శుభారంభం అదిరింది. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో విజ్డెన్‌ ట్రోపీని సొంతం చేసుకుంది. కాగా ఇరు దేశాల మధ్య జరిగే ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టుకు విజ్డెన్‌ ట్రోపీని అందించడం ఆనవాయితీగా వస్తుంది.

మూడో టెస్టులో భాగంగా 399 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టు బారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 5 వికెట్లతో రాణించగా, స్టువర్ట్‌ బ్రాడ్‌ మరోసారి 4 వికెట్లతో రాణించాడు..

రోనా నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్‌ విజయవంతం కావడంతో పాటు క్రికెట్‌కు సరికొత్త ఊపునిచ్చింది. అసలే టెస్టు సిరీస్‌.. దీనిని ఎవరు పట్టించుకుంటారులే అన్న సందేహాలకు తావివ్వకుండా ఇరు జట్లు విజయం కోసం (మూడో టెస్టు మినహాయించి) పోరాడాయి. మొదటి టెస్టులో పర్యాటక జట్టు విండీస్‌ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు విండీస్‌పై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలినా ఇంగ్లండ్‌ బౌలర్ల అద్భుత బౌలింగ్‌తో ఆతిథ్య జట్టు ట్రోపీని ఎగరేసుకుపోయింది

Tags :
|
|

Advertisement