Advertisement

హడలెత్తించిన హోల్డర్ ..పట్టుబిగించిన విండీస్

By: Sankar Fri, 10 July 2020 07:38 AM

హడలెత్తించిన హోల్డర్ ..పట్టుబిగించిన విండీస్



ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జాగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో వెస్ట్ ఇండీస్ పట్టు బిగించింది ..తొలి రోజు వర్షం కారణంగా కేవలం 17.4 ఓవర్ల అయితే సాధ్యమయినప్పటికీ రెండో రోజు మాత్రం వరుణుడు కరుణించాడు..ఓవర్ నైట్ స్కోర్ 35/1 తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు ..వెస్ట్ ఇండీస్ బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది ..ఇంగ్లాండ్ వికెట్ల పతనానికి గాబ్రియేల్ పునాది వేస్తే , కెప్టెన్ హోల్డర్ ముగింపు పలికాడు ..ఈ ఇద్దరి దాటికి ఒక్క బాట్స్మన్ కూడా క్రీజ్ లు నిలబడలేకపోయారు ..విండీస్ ఆటతీర్తు చూస్తే చాల కాలం తర్వాత ఆడుతున్నట్లు ఏ మాత్రం లేదు ..ముఖ్యంగా హోల్డర్ బంతితో నిప్పులు చెరిగాడు ..మొతం ఆరు వికెట్లు తీసుకోని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు ..

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్టోక్స్‌ (43; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... బట్లర్‌ (35; 6 ఫోర్లు), డామ్‌ బెస్‌ (31 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 19.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (20 బ్యాటింగ్‌), షై హోప్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. క్యాంప్‌బెల్‌ (28; 3 ఫోర్లు)ను అండర్సన్‌ ఔట్‌ చేశాడు. రెండో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించినా చివరకు 69.2 ఓవర్ల ఆట సాగడం కొంత ఊరట.

అయితే చాలా కాలం తర్వాత మ్యాచ్ జరగడం వల్లనో ఏమో అంపైరింగ్ నిర్ణయాలు పేలవంగా ఉన్నాయి ..ఆరుసార్లు రివ్యూకు వెళ్లగా ఇందులో ఐదుసార్లు ఆటగాళ్లకె అనుకూల ఫలితాలొచ్చాయి. ఒక్కసారి మాత్రమే అంపైర్‌ నిర్ణయం సరైందిగా తేలింది.మూడో రోజు ఆటలో విండీస్ బాట్స్మన్ రాణింస్తే ..వెస్ట్ ఇండీస్ ఈ టెస్ట్ మీద పూర్తి పట్టు బిగిస్తుంది ..

Tags :
|
|

Advertisement