Advertisement

  • అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్షాల పాత్రపై అనుమానంగా ఉంది..దేవాదాయ శాఖ మంత్రి

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్షాల పాత్రపై అనుమానంగా ఉంది..దేవాదాయ శాఖ మంత్రి

By: Sankar Mon, 07 Sept 2020 6:26 PM

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్షాల పాత్రపై అనుమానంగా ఉంది..దేవాదాయ శాఖ మంత్రి


అంతర్వేది రథం దగ్దం ఘటనలో ప్రతిపక్షాల పాత్ర ఉందని అనుమానం వస్తోందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద కావాలనే కొందరు మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

హిందూవుల మీద వైసీపీ ప్రభుత్వంలో ఏదో జరుగుతోందనే భావన కల్పించేలా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. అంతర్వేది ఈవోను బదిలీ చేస్తున్నాం... రథం దగ్దం ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా రూ. 90 లక్షల వ్యయంతో కొత్త రథం సిద్దం చేస్తాం.‍.. అంతర్వేది ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు.

గత పుష్కరాల్లో చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశారు.... గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల రథాలని సీసీ కెమెరాలతో నిఘా పెడతాం...సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేసే బాధ్యతలు కూడా ఓ వ్యక్తికి అప్పజెప్పాలని సూచించామని పేర్కొన్నారు.

కాగా అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ ఘటనపై కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు..ఈ సంఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా ఎక్కడా ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు.

మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, చెత్తను పోగు చేసి మంట పెడుతున్నట్టు గుర్తించారు. రథం దగ్ధం సంఘటన జరిగిన శనివారం రాత్రి ఆ వ్యక్తి మంటలు.. మంటలు.. అంటూ కేకలు వేస్తూ వెళ్లాడని అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఒకపక్క పోలీసులు, మరోపక్క రెవెన్యూ అధికారులు ఈ మిస్టరీని ఛేదించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ధ్రువీకరించారు

Tags :
|

Advertisement