Advertisement

  • Breaking : జమ్ములో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం...!

Breaking : జమ్ములో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం...!

By: Anji Thu, 19 Nov 2020 10:26 AM

Breaking : జమ్ములో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం...!

జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

ఉగ్రవాదుల కదలికలపై భద్రతాదళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో..జమ్ము నగర సమీపంలో బాన్ టోల్‌ప్లాజా వద్ద వచ్చి పోయే వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి బస్సులో వచ్చిన ఉగ్రవాదులు భద్రతాబలగాలను చూసి కాల్పులు జరిపారు.

దీంతో అలెర్టయిన సెక్యూరిటీ ఫోర్సెస్..ఉగ్రవాదులను వెంబడించి కాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్‌లో సైనికులు కూడా పాల్గొన్నారని, ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు చనిపోయారని జమ్ము ఎస్పీ శ్రీధర్ పాటిల్ చెప్పారు.

ఉద్రిక్తల నేపథ్యంలో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు పోలీసులు. జమ్ముతో పాటు ఉధంపూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నగ్రోటా చెక్‌పోస్ట్ ఏరియాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.

వీరంతా సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడిన ముష్కరులు అని భద్రతా బలగాలు తెలిపాయి.బాన్ టోల్‌ప్లాజాలో ఈ ఏడాది జనవరి 31న కూడా ఇదే తరహాలో ఎన్‌కౌంటర్ జరిగిందని సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు.

టోల్ ప్లాజాలో ఉన్న పోలీసులపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఒక పోలీసు గాయపడ్డాడని వివరించారు.

అప్పటి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులని అంతమొందించామని వెల్లడించారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరిగిందని సీఆర్పీఎఫ్ అధికారి శివ్‌నందన్ సింగ్ చెప్పారు.

Tags :

Advertisement