Advertisement

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్..!

By: Anji Sun, 30 Aug 2020 1:54 PM

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్..!

జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్‌లోని పంథా చౌక్ చెక్‌పోస్టు వద్ద విధుల్లో సీఆర్‌పీఎఫ్ జవానుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. అప్రమత్తమైన స్థానిక భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ క్రమంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.

దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. గత మూడురోజుల్లో ఇప్పటి వరకు 10 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

Tags :
|

Advertisement