Advertisement

  • కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపై స్పందించిన ఈఎన్సీ హరిరామ్‌

కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపై స్పందించిన ఈఎన్సీ హరిరామ్‌

By: Sankar Tue, 30 June 2020 9:02 PM

కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపై స్పందించిన ఈఎన్సీ హరిరామ్‌



కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపై ఈఎన్సీ హరిరామ్‌ స్పందించారు. కొత్త కాలువలకు గండిపడటం సర్వసాధారణమన్నారు. తాము అనుకున్నదాని కంటే తక్కువగానే జరిగాయని చెప్పారు. కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో అధికారుల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించాలి కానీ చిన్న సంఘటనలను చూపి ఇంజినీర్లను నిరాశకు గురిచేయొద్దని ఈఎన్సీ హరిరామ్‌ అన్నారు.

కాగా మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడి కాలువకు గండి పడింది. దీంతో స్థానిక గ్రామంలోకి నీరు చేరింది. పొలాలు, కూరగాయల తోటల్లోకి నీరు చేరినట్లు గ్రామస్థులు చెప్పారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో అధికారులు నీటిని నిలిపివేశారు.

కాగా ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని అన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణని ఆరోపించారు. నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు


Tags :
|

Advertisement