Advertisement

  • ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగులు నిరసన

ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగులు నిరసన

By: chandrasekar Tue, 30 June 2020 7:34 PM

ప్రఖ్యాత ఈ కామర్స్  సంస్థ అమెజాన్ లో ఉద్యోగులు నిరసన


అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగులు నిరసనకు దిగారు. కోవిడ్ 19 వైరస్ బారిన పడినా సరే సంస్థ ఆదుకోవడం లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల భద్రత అక్కడ కూడా ప్రశ్నార్ధకమౌతోంది.

ఈ కామర్స్ మార్కెట్ లో ప్రఖ్యాత కంపెనీగా ఉన్న అమెజాన్ సంస్థకు అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ జర్మనీ. ఇప్పుడీ దేశంలో ఆ సంస్థకు కష్టాలెదురయ్యాయి. జర్మనీలోని అన్ని బ్రాంచ్ ల ఉద్యోగులు 48 గంటల సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఆ సంస్థ ఉద్యోగులు కూడా కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారు. అయితే సంస్థ మాత్రం ఉద్యోగులకు ఆర్ధిక సహాయం అందించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదనేది వారి ఆవేదనగా ఉంది.

గుడ్ అండ్ హెల్తీ వర్క్ నినాదంతో ఈ సమ్మె 48 గంటల పాటు కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కరోనా సంక్షోభ సమయంలో సైతం కంపెనీ స్వప్రయోజనాలు, లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. జర్మనీలో ఆ సంస్థల్లో పనిచేస్తున్న 30-40 మందికి కరోనా సోకినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధైన ఓర్హాన్ అక్మాన్ తెలిపారు.

ఈ ఆరోపణలన్నింటినీ అమెజాన్ సంస్థ ఖండించింది. సంస్దకు చెందిన ఉద్యోగులు, వినియోగదార్ల భద్రత దృష్ట్యా జూన్ వరకూ 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టామని స్పష్టం చేసింది. ఇప్పటికే 21 మిలియన్ల గ్లవ్స్, 18 మిలియన్ల ఫేస్ మాస్కులుతో పాటు 39 మిలియన్ల ఇతర రక్షణ సామగ్రిని అందించినట్టు ఆ సంస్థ జర్మనీ ప్రతినిధి తెలిపారు.

Tags :
|

Advertisement