Advertisement

  • వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది ..లింక్డిన్

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది ..లింక్డిన్

By: Sankar Thu, 08 Oct 2020 9:13 PM

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది ..లింక్డిన్


కరోనాకు ముందు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం గురించి సాధారణ ఉద్యోగులకు పెద్దగా తెలియదు. ఉదయం ఆఫీస్ కు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం ఇదే పని. అయితే, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి పనికి కంప్యూటర్ ను వినియోగిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను తీసుకున్నారు. ప్రయాణం తగ్గుతుంది, ఇంట్లోనే ఉండి పనిచేయొచ్చు... అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ లింక్డిన్ పేర్కొన్నది. ఈ అంశంపై లింక్డిన్ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో వర్క్ చేసే తల్లులకు పిల్లల వలన ఇబ్బందులు కలుగుతున్నట్టు 25శాతం మంది పేర్కొంటే, తండ్రులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని తెలిపారు. దేశంలో 41శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరిగినట్టు సర్వేలో తేలింది. పనికి వ్యక్తిగత జీవితానికి తేడా లేకపోవడం వలనే ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో తేలింది.

Tags :
|
|
|

Advertisement