Advertisement

  • ఐపీయల్ పనులను వేగవంతం చేసిన బీసీసీఐ ..ఐపీయల్ నిర్వహాంపై యూఏఈ కి లేఖ

ఐపీయల్ పనులను వేగవంతం చేసిన బీసీసీఐ ..ఐపీయల్ నిర్వహాంపై యూఏఈ కి లేఖ

By: Sankar Mon, 27 July 2020 6:29 PM

ఐపీయల్ పనులను వేగవంతం చేసిన బీసీసీఐ ..ఐపీయల్ నిర్వహాంపై యూఏఈ కి లేఖ



తమ దేశంలో ఈ ఏడాది ఐపీఎల్​ నిర్వహణపై బీసీసీఐ రాసిన అధికారిక లేఖ అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. తుది ఒప్పందానికి సంబంధించి భారత ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తామని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది ఐపీఎల్​ 13వ సీజన్​ను యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్​ 8వ తేదీ వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఈ మేరకు యూఏఈ బోర్డుకు లేఖ రాసింది. దీనిపై ఈసీబీ సోమవారం స్పందించింది.

“అధికారిక లేఖ అందుకున్నాం. తుది ఒప్పందంతో సంబంధమున్న విషయాలపై భారత ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. టోర్నీ నిర్వహణపై ఇరు బోర్డులు వివరంగా చర్చించుకున్నాయి. సంబంధించిన శాఖలతో సమాలోచనలు జరిపాం. అంతర్గత కమిటీలతో చర్చించాం. సురక్షిత వాతావరణంలో టోర్నీని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నాం” అని ఎమిరేట్స్ బోర్డు అధ్యక్షుడు ముబాషిర్ ఉస్మానీ తెలిపాడు. కాగా 2014 ఐపీఎల్​లో తొలి 20 మ్యాచ్​లు యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే.

కాగా ఆస్ట్రేలియాలో జరిగే టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఐపీయల్ నిర్వహణకు మార్గం సుగమం అవ్వడంతో బీసీసీఐ చకచకా ఐపీయల్ పనులను జరిపిస్తుంది ..ఒకవేళ ఐపీయల్ జరగకపోతే 4000 కోట్ల దాకా నష్టం వచ్చే అవకాశం ఉండటంతో ఐపీయల్ నిర్వహణకు బీసీసీఐ మొగ్గు చూపింది..దీనితో సెప్టెంబర్ 19 నుంచి ఐపీయల్ పదమూడవ సీజన్ యూఏఈ లో ప్రారంభం అవుతుంది అని తెలుస్తుంది

Tags :
|
|

Advertisement