Advertisement

ఏలూరు అంతు చిక్కని వ్యాధి.. ఆసక్తికర విషయాలు

By: chandrasekar Mon, 07 Dec 2020 7:03 PM

ఏలూరు అంతు చిక్కని వ్యాధి.. ఆసక్తికర విషయాలు


ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఏలూరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందింంచాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు పెరుగుతున్నారు. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 340మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. 180 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. ఈ ఆరోగ్య సమస్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ కీలక నివేదికను విడుదల చేశారు. 340 మంది మొత్తం అస్వస్థకు గురైనవారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 157 మంది.ఒకరు మరణించారు. మెరుగైన చికిత్సకోసం 14 మందిని తరలించారు. 168 డిశ్చార్జి అయ్యారు. ఏలూరు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 5 గురికి చికిత్స జరుగుచుండగా, వారు కూడా డిశ్చార్జి అయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180, మహిళలు 160 మంది ఉన్నారు.అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు అర్బన్‌కు చెందినవారు 307 కాగా, ఏలూరు రూరల్‌కు చెందిన వారు 30. దెందులూరు 3.

లక్షణాలు :

3 – 5 నిమిషాలపాటు మూర్ఛ.. ఒక్కసారి మాత్రమే, రిపీట్‌ కాలేదు, మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం. ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు, తీవ్రత తక్కువగా ఉందంటున్నారు. ఒకేసారి వస్తుంది.. మళ్లీ రావడం లేదని తేల్చారు. ఏలూరు మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దకు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు.. రోజూ మినరల్‌వాటర్‌ తాగే వాళ్లుకూడా అస్వస్థతకు గురయ్యారు. 22 తాగు నీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణస్థితినే సూచించాయి.52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి.. 35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షంగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చింది. కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉంది. 45 మంది సీటీ స్కాన్‌ చేశారు.. నార్మల్‌గానే ఉంది.9 పాల నమూనాలను స్వీకరించారు.. అవికూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి.

సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణకోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు.. వాటి ఫలితం రావాల్సి ఉంది. 62 గ్రామ, వార్డు సచివాలయాలు సర్వేలోపాల్గొన్నాయి. 57,863 కుటుంబాల్లో ఉన్నవారిపై ఆరోగ్య సర్వే చేశారు. కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థులను గుర్తించారు. వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులు సహా 56 మంది డాక్టర్లు.. మైక్రో బయాలజిస్ట్‌లు 3.. నర్సులు 13 మంది, ఎఫ్‌ఎన్‌ఓలు 117, ఎంఎన్‌ఓలు99, అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2062 మెడికల్‌ క్యాంపుల నిర్వహిస్తూ.. 24 గంటలు మెడికల్‌ క్యాంపులు నడిచాయి. ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి సహా నాలుగు ఆస్పత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్‌లో 50 బెడ్లు కేటాయించారు.. 12 మంది డాక్టర్లు, 4 అంబులెన్స్‌లు, 36 మంది నర్సింగ్‌ సిబ్బంది ద్వారా సేవలు. విజయవాడకు ఇప్పటివరకూ 7గురు తరలింపు.. అందరి పరిస్థితి స్థిరంగా ఉంది.

Tags :
|

Advertisement