Advertisement

జూన్ 19న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

By: chandrasekar Tue, 02 June 2020 1:40 PM

జూన్ 19న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు


కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది. జూన్ 19న మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీ 4, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, ఝార్ఖండ్ 2, మణిపూర్ 1, మేఘాలయ 1 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

elections,18 rajya sabha,seats,on,june 19 ,జూన్, 19న, 18 రాజ్యసభ, స్థానాలకు, ఎన్నికలు


దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఫిబ్రవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఐతే 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు అవసరం లేకుండా ఏగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటికే కరోనా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఎన్నికలు ఆగిపోయాయి. ఆయా స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తాజగా ప్రకటించింది.

Tags :
|
|

Advertisement