Advertisement

  • ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం అయింది ...మధుయాష్కీ

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం అయింది ...మధుయాష్కీ

By: Sankar Tue, 01 Dec 2020 10:57 PM

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం అయింది ...మధుయాష్కీ


పోలింగ్ శాతం తగ్గడం విచారకరమని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ అన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు ఓట్లేసేందుకు రాకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ విఫలమైందని పేర్కొన్నారు.

ఇంత తక్కువ ఓటింగ్ మునుపెన్నడూ లేదన్నారు. అధికార పార్టీ సేవలో ఎన్నికల కమిషన్ పరితపించిపోయిందన్నారు. నగరంలో మతకల్లోలాలు జరుగుతాయని కేసీఆర్, కేటీఆర్, డీజీపీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోలింగ్‌పై ఆయ‌న స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమన్నారు. కానీ హైదరాబాద్‌లాంటి విద్యావంతులు అత్యధికంగా ఉండే నగరంలో తక్కువ ఓటింగ్ శాతం జరగడం విచార‌క‌ర‌మ‌న్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పని చేసిన స్థానికులకు, ఎన్నారై టీఆర్ఎస్ స‌భ్యుల‌కు, ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు

Tags :
|

Advertisement