Advertisement

  • గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల...

గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల...

By: Sankar Tue, 17 Nov 2020 1:30 PM

గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల...


తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది.

రేపటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుండగా.. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన.. 22న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 4న కౌంటింగ్, ఫలితాలు వెలువడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు.

గత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని.. రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి సంబంధించిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఇక 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారం మేయర్ పదవి మహిళకు రిజర్వ్ అయ్యి ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు

Tags :
|

Advertisement