Advertisement

  • గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై వివిధ పార్టీలతో భేటీ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై వివిధ పార్టీలతో భేటీ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్

By: Sankar Thu, 12 Nov 2020 3:52 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై వివిధ పార్టీలతో భేటీ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్


త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి‌ గురువారం సమావేశాలు నిర్వహించారు.

ఎన్నికల కమిషనర్‌‌ రాజకీయ పార్టీలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా సీపీఐ, బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి ఎన్‌వీఎస్ఎస్‌ ప్రభాకర్‌, చింతల, ఆంటోని రెడ్డిలు పాల్గొన్నారు. అన్నిపార్టీలతో గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై కమిషనర్‌ చర్చించారు.

కాగా ఈ భేటీలకు గుర్తింపు పొందిన 11 పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు జరిపింది.భేటీ అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరదల సాయం అందరికీ అందలేదన్నారు. ఒక్కో డిజవిన్‌లో జనాభా సంఖ్యలో చాలా తేడా ఉందని, లోపాలు సరిదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

Tags :
|

Advertisement