Advertisement

  • కరోనా నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం...జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పందించిన ఎన్నికల కమీషనర్

కరోనా నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం...జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పందించిన ఎన్నికల కమీషనర్

By: Sankar Tue, 17 Nov 2020 1:50 PM

కరోనా నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం...జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పందించిన ఎన్నికల కమీషనర్


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ గ్లోబల్‌ సిటీ అని, ఇక్కడ నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ముగస్తుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పాలకవర్గం గడువు ముగిసే మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వార్డుల విభజన లేదని, 2016లో మాదిరిగానే 150 వార్డులకు, అవే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు...ఎన్నికల కోసం జీహెచ్‌ఎంసీ, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాక తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఎలక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 150 వార్డుల్లో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉంటాయని చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నామని, ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బ్యాలెట్‌ను వైట్‌ పేపర్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.2500, ఇతరులు రూ.5వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు వచేయవచ్చని, ఫామ్‌ వెరిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

Tags :
|

Advertisement