Advertisement

  • Breaking: ఎన్నికల ఫలితాలపై కమిషన్ క్లారిటీ ఇచ్చింది..!

Breaking: ఎన్నికల ఫలితాలపై కమిషన్ క్లారిటీ ఇచ్చింది..!

By: Anji Tue, 10 Nov 2020 6:55 PM

Breaking: ఎన్నికల ఫలితాలపై కమిషన్ క్లారిటీ ఇచ్చింది..!

నాలుగు ఈవీఎంలు మొరాయించడంతో ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు విజయాన్ని ఈసీ కన్‌ఫర్మ్ చేసింది.

నాలుగు ఈవీఎంలలో రెండింటి ఓట్లను అధికారులు లెక్కించారు. వాటిలో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిని సుజాతకు 39 ఓట్ల ఆధిపత్యం లభించింది. దాంతో 23 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థికి మిగిలిన 1,118 ఓట్ల ఆధిక్యం కాస్తా.. 1079కు తగ్గింది.

అయితే, ఇంకా తెరుచుకోని రెండు ఈవీఎంలలో లెక్కించాల్సిన ఓట్ల సంఖ్య 897. కాగా ఇప్పటికే రఘునందన్ రావుకు 1079 ఓట్ల ఆధిక్యం వుండడంతో మిగిలిన ఈవీఎంలలో లెక్కించాల్సిన అన్ని ఓట్ల కంటే మెజారిటీ ఇక్కువగా వున్నట్లు అధికారులు తేల్చారు.

దాంతో రఘునందన్ రావు విజయాన్ని అధికారికంగా ధృవీకరించారు. లెక్కింపు కానీ ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువ ఉండడంతో గెలుపును ఖరారు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేశారు.

Tags :
|

Advertisement