Advertisement

  • కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం చర్యలు...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం చర్యలు...

By: chandrasekar Sat, 31 Oct 2020 09:26 AM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం చర్యలు...


ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకున్నది. ఆయన పలుసార్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను తొలగించింది. ఎన్నికల నియమాల ఉల్లంఘనలపై ఈ మేరకు గట్టిగా హెచ్చరించింది.

ఇకపై కమల్‌ నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే సంబంధిత నియోజకవర్గం అభ్యర్థి ఆ వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలలో ఆయన ప్రచారం చేయకుండా ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను ఈసీ జారీ చేసింది. ఇటీవల దాబ్రాలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్‌ నాథ్‌, బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిని ‘ఐటమ్‌’గా అభివర్ణించారు.

ఈయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగించింది. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దీనిపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మరోవైపు బీజేపీ నేతలు కమల్‌ నాథ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయగా కమల్‌ నాథ్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్టార్‌ ప్రచారకర్త హోదాను ఈసీ రద్దు చేసింది. ఇందువల్ల ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేరు.

Tags :
|

Advertisement