Advertisement

బీహార్‌లో పిడుగుల బీభ‌త్సం వల్ల 83 మంది మరణం

By: chandrasekar Fri, 26 June 2020 1:53 PM

బీహార్‌లో పిడుగుల బీభ‌త్సం వల్ల 83 మంది మరణం


దేశం లో నైరుతి రుతుపవనాల వలన చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, ఉత్తరదేశం ఐన బీహార్‌లో పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. నిన్న ఉద‌యం నుంచి ఎడ‌తెర‌పి లేకుండా ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురువ‌డంతో దాదాపు అన్ని జిల్లాల్లో పిడుగుల బీభ‌త్సం కొన‌సాగింది.

ఉద‌యం నుంచి మృతుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ సాయంత్రానికి 83కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి 83 మంది మ‌ర‌ణించార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

జిల్లాల వారీగా చూస్తే గోపాల్‌గంజ్‌లో అత్య‌ధికంగా 13 మంది పిడుగుపాట్ల‌వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయి స‌హా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క‌రు చొప్పున పిడుగుపాట్ల‌కు బ‌ల‌య్యారు.

కాగా, ఈ విప‌త్తుపై బీహార్ ముఖ్య‌మంత్రి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే బీహార్‌లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది.

Tags :
|
|

Advertisement