Advertisement

  • ఆసుపత్రిలో అగ్నికి ఆహుతి అయిన ఎనిమిది మంది రోగులు ..

ఆసుపత్రిలో అగ్నికి ఆహుతి అయిన ఎనిమిది మంది రోగులు ..

By: Sankar Thu, 06 Aug 2020 10:19 AM

ఆసుపత్రిలో అగ్నికి ఆహుతి అయిన ఎనిమిది మంది రోగులు ..



గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకపక్క కరోనా విలయంతో దేశ ప్రజలు వణికిపోతోంటే..ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం మరింత ఆందోళన రేపింది. అహమ్మాదాబాద్ లోని కోవిడ్-19 ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది కరోనా రోగులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారీగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 8 మంది రోగులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సుమారు 40 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

గుజరాత్, అహ్మదాబాద్ ఆసుపత్రి విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు..ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అహ్మదాబాద్ మేయర్​ బిజాల్ పటేల్​తో మాట్లాడినట్టు మోదీ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

స్థానిక యంత్రాంగం బాధితులకు అన్నివిధాలా సహాయం అందిస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

Tags :
|
|
|

Advertisement