Advertisement

  • గుడ్డు తినేవారికి గుడ్ న్యూస్ ...తగ్గిన గుడ్డు ధరలు

గుడ్డు తినేవారికి గుడ్ న్యూస్ ...తగ్గిన గుడ్డు ధరలు

By: Sankar Wed, 04 Nov 2020 5:17 PM

గుడ్డు తినేవారికి గుడ్ న్యూస్ ...తగ్గిన గుడ్డు ధరలు


కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఇమ్యూనిటీ బూస్టప్‌‌‌‌లో కోడిగుడ్డు కూడా భాగం కావడంతో చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది. ఎప్పుడూ తినని వారు కూడా ఇప్పుడు గుడ్డు తింటున్నారు. దింతో గుడ్డు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది.

తాజాగా కోడిగుడ్డు ధర తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఊరట కల్గిస్తుంది. మార్కెట్లో అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతుంటే కోడిగుడ్డు ధర మాత్రం దిగి వస్తుంది. కరోనా కారణంగా రిటైల్ మార్కెట్ లో గుడ్డు ధర రూ.7 రూపాయలకు చేరుకుంది. 3 రోజుల నుండి ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రైతు ధర రూ. 5.05 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.5.50 ఉంది. ఇటీవల వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గుడ్డు ప్రధానమని వైద్య నిపుణులు చెప్పడంతో అంతా గుడ్లను తినడం మొదలు పెట్టారు.

రోజు గుడ్డు తినే వారి సంఖ్యకూడా బాగా పెరిగిపోయింది. దాంతో గుడ్డు ధర ఎగబాకడం మొదలయింది. చివరకు రికార్డు స్థాయిలో పేదవారికి అందుబాటులో ఉండేలాగా 5.05 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో రూ.6 నుంచి 7 రూపాయల వరకు విక్రమయాలు సాగాయి. దాదాపు 24 పైసల ధర తగ్గడంతో వ్యాపారాలు గొల్లుమంటున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇటీవల ఎగుమతులు తగ్గడంతో కోడిగుడ్డు ధర పడిపోయింది.

Tags :
|
|

Advertisement