Advertisement

  • బురేవి తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు

బురేవి తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు

By: chandrasekar Fri, 04 Dec 2020 5:45 PM

బురేవి తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు


బురేవి తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బురేవి తుపాన్‌ ప్రభావంతో తమిళనాడులోని పుదుచ్చేరిలో ఎడతెరిపి వర్షం కురిస్తుండటంతో ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలకు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాన్‌ కారణంగా శుక్రవారం పుదుచ్చేరిలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇందుకోసం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించారు.

తమిళనాడు తీరా ప్రాంతంలో బురేవి తుపాన్‌‌ ఉత్తర శ్రీలంక మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మన్నార్ గల్ఫ్ మీద కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంబన్ తీరానికి పశ్చిమ దిశగా తుపాన్‌ కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ-నైరుతిలో ప్రయాణించి దక్షిణ తమిళనాడు తీరంలోని పంబన్ - కన్యాకుమారి మధ్య ఇవాళ రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశమున్నట్లు తెలిసింది. ఇందువల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Tags :

Advertisement