Advertisement

  • రోజుకు రెండు పూటలా రైస్ తింటే ఏమవుతుందో తెలుసా!

రోజుకు రెండు పూటలా రైస్ తింటే ఏమవుతుందో తెలుసా!

By: Sankar Mon, 07 Sept 2020 5:21 PM

రోజుకు రెండు పూటలా రైస్ తింటే ఏమవుతుందో తెలుసా!


మనదేశమ్లో చాల శాతం ప్రజలు ఎక్కవగా తినే ఆహారం రైస్.. దాదాపు రెండు పూటలా అవసరం ఈయూతె మూడు పూటలా కూడా రరైస్ తింటూ ఉంటారు..అయితే రెండు పూటలా రైస్ ను తీసుకోవడం రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది. పైగా డయాబెటిస్ 2 వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైట్ కలర్ రైస్ ను అధికంగా తీసుకుంటే దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మాములుగా రైస్ లో విటమిన్ బి ఉంటుంది. తెల్లగా కనిపించేందుకు ఎక్కువసార్లు పాలిష్ చేయడం వలన విటమిన్ బి తో పాటుగా పోషకాలు బయటకుపోతాయి. బియ్యంలో గ్లేసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఫలితంగా డయాబెటిస్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాలిష్ చేసిన బియ్యంతో కూడిన భోజనం చేయడం వలన బెరిబెరి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

రోజుకు 450 గ్రాముల కంటే ఎక్కువ మొత్తంలో తెల్లని రైస్ ను ఆహారంగా తీసుకునే వారికి షుగర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. రైస్ కు బదులుగా రాగులు, సజ్జలు గోధుమతో కూడిన ఆహారం తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.

Tags :
|
|
|

Advertisement