Advertisement

పచ్చళ్లు ఎక్కువ తింటే అనారోగ్యం

By: chandrasekar Tue, 09 June 2020 4:37 PM

పచ్చళ్లు ఎక్కువ తింటే అనారోగ్యం


కొంత మందికి పచ్చడి అంటే ప్రాణం. ఎన్ని కూరలున్నా సరే అంచుకు పచ్చడి ఉండాల్సిందే. వేడివేడి అన్నంలో పచ్చడి, కాస్త నెయ్యి కలుపుకుని తింటే ఆ మజానే వేరు. వేసవి రాగానే చాలా మంది ఆవకాయ పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే ఏ ఆహారమైన సరే అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజుకు ఎంత పచ్చడి తీనాలో తెలుసుకోవాలి. లేదా ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు.

బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు పచ్చళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బీపీ ఉన్నవాళ్లు పచ్చడి ఎంత తక్కువ తీంటే అంత మంచిది. ఎందుకంటే అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ ఉన్నవారు కూడా రోజుకు ఒక్క ఆవకాయముక్క కన్నా ఎక్కువ తీసుకోవద్దు. వేసవిలో పచ్చళ్లు ఎక్కువగా తింటే శరీరానికి వేడి చేసే ప్రమాదమూ ఉంది. పచ్చళ్లు ఒకటే కాదు మనకు ఇష్టమైన ఆహారం ఎదైనా సరే రోజు కొద్దికొద్దిగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Tags :
|
|

Advertisement