Advertisement

  • ప్లాస్మా డొనేట్ చేయండి ..ఇతరుల ప్రాణాలను కాపాడండి ..ఈటెల రాజేందర్ అభ్యర్ధన

ప్లాస్మా డొనేట్ చేయండి ..ఇతరుల ప్రాణాలను కాపాడండి ..ఈటెల రాజేందర్ అభ్యర్ధన

By: Sankar Thu, 09 July 2020 3:04 PM

ప్లాస్మా డొనేట్ చేయండి ..ఇతరుల ప్రాణాలను కాపాడండి ..ఈటెల రాజేందర్ అభ్యర్ధన



కరోనా మహమ్మారికి ఇంకా వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతోనే ఉన్న వాటితోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు ..అయితే కరోనా వ్యాధి నివారణకు కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఉపయోగపడుతుంది అని తేలింది ..దీనితో అన్ని రాష్ట్రాలలో ప్లాస్మా డొనేషన్ కొరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మంత్రులు కరోనా నుంచి కోలుకున్న వారిని అభ్యర్థిస్తున్నారు ..అయితే తాజాగా తెలంగాణాలో కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఈటె రాజేందర్ ఇలాంటి అభ్యర్ధనే చేసారు ..కరోనా నుంచి రికవరీ అయిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు. ప్లాస్మా డొనేషన్ వల్ల కరోనా రోగుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

కరోనా వైరస్ బారిన పడిన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం ద్వారా వారు కోలుకుంటున్నారు. ఇందుకోసం కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారిన వారి నుంచి ప్లాస్మా సేకరించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూపులు కూడా సరిపోవాల్సి ఉంటుంది. రికవరీ రేటు బాగుండటంతో... గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోనైతే ఏకంగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను డొనేట్ చేయడం వల్ల ఈ వైరస్ బారిన పడిన మరో వ్యక్తి ప్రాణాలను కాపాడొచ్చు.

అయితే మంత్రి ఇలా ట్వీట్ చేయగానే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ..కొంతమంది మీ పార్టీ లో కరోనా బారిన పడి కోలుకున్న వారిని ముందు ఇవ్వమనండి అనగా , మరికొందరు ముందు మీరు కరోనా వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోండి అప్పుడు వాళ్ళు కోలుకున్నాక ప్లాస్మా ఇస్తారు అని అన్నారు ..

Tags :
|

Advertisement