Advertisement

టీ తాగేటపపుడు స్నాక్స్ తినొద్దు...

By: chandrasekar Sat, 12 Dec 2020 8:05 PM

టీ తాగేటపపుడు స్నాక్స్ తినొద్దు...


కొన్ని పరిశోధనల్లో టీ త్రాగడం అంత మంచిది కాదని తేలింది. టీలోని కెఫీన్ ఒంటికి చేరి చురుకుదనం పెంచుతుంది. పరగడపున టీ తాగటం చాలా ప్రమాదకరమ౦. ప్లాస్టిక్ కప్పులో టీ తాగటంతో క్యాన్సర్ వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే వేడివేడి టీ ని మనం ఎలాంటి కప్పుల్లో తాగుతున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. బంగారం లేదా వెండి కప్పుల్లో గరం గరం చాయ్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిద౦ట. ఐఐటీ ఖరగ్ పూర్ చేసిన పరిశోధన ప్రకారం ఓ వ్యక్తి రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే. మంచి పోషకాలున్నడ్రై ఫ్రూట్స్, కూరగాయలు టీ తో పాటు తీసుకుంటే విషంగా మారటం ఖాయం.

సెనగపిండితో చేసిన వంటలతో పాటు టీ తాగితేఒంట్లో పోషకాలు తగ్గిపోతాయి. నిమ్మకాయ రసం పిండుకుని లెమన్ టీ లా పదేపదే తాగేవారి సంఖ్య క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటూ టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. శీతాకాలం, వర్షాకాలంలో టీ తాగితే ఒంట్లో కాస్త సత్తువ వస్తుంది, హుషారు పుట్టుకొస్తుంది, టీ లోని కెఫిన్ మన మెదడును చురుకుగా ఉంచుతుంది. అతిగా మాత్రం త్రాగకండి.

Tags :
|
|
|

Advertisement