Advertisement

జపాన్లోని రీహోకు జిల్లాలో భూప్రకంపనలు

By: chandrasekar Sat, 05 Sept 2020 1:32 PM

జపాన్లోని రీహోకు జిల్లాలో భూప్రకంపనలు


శుక్రవారం ఉదయం జపాన్‌లోని రీహోకు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 5.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.10 గంటలకు ఫుకుయ్‌ ప్రిఫెక్చర్‌ ప్రాంతంలోఈ భూకంపనలు చోటు చేసుకున్నాయి.

భూకంపం సంభవించిన ప్రాంతానికి ఉత్తరాన 36.1 డిగ్రీల అక్షాంశ, 136.2 డిగ్రీల తూర్పు రేఖాంశాల నడుమ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు ప్రకటించలేదు.

Tags :
|

Advertisement